నల్గొండ : నల్లగొండ(Nalgonda )మున్సిపల్ చైర్మన్(Municipal Chairman)గా 32వ వార్డు కౌన్సిలర్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి(Burri Srinivas Reddy )ఎన్నికయ్యారు. సోమవారం బుర్రి శ్రీనివాస్ రెడ్డిని చైర్మన్గా మెజారిటీ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. కాగా, గత నెల జనవరి 8న బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పై అవిశ్వాసం నెగ్గడంతో చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కోల్పోయింది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.