ఇల్లెందు/ టేకులపల్లి, మార్చి 22: ‘ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ బాధిత పే దలకు ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నందుకు అరెస్ట్ చేస్తారా?’ అంటూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
‘ఖమ్మం భూదాన్ భూముల్లో పేదల ఇండ్లను కూల్చిన ప్రభుత్వం.. కొందిరికే ఇళ్ల స్థలాలు, ఇండ్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం న్యాయమేనా?’ అని నిలదీశారు. భూదాన్ బాధితుల్లో అర్హులందరికీ న్యాయం చేయాలని, ఇప్పటికీ ఇండ్ల స్థలా ల పట్టాలు, ఇందిరమ్మ ఇండ్ల ఇవ్వని వారి కి వెంటనే ఇవ్వాలని డిమాండ్చేస్తూ.. ఎన్డీ ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఎన్డీ నాయకులను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఎన్డీ నాయకులు భద్రాద్రి జిల్లా ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో నిరసన చేట్టారు.
టేకులపల్లి, ఇల్లెందు మండలం పోలారం, మర్రిగూ డెం, కొమరారం గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ.. భూదాన్ బాధితులకు న్యాయం చేయాలని నిరసన వ్యక్తంచేసినందుకు అరెస్ట్ చేయడం ప్రభుత్వ దౌర్జన్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు.