యాదాద్రి భువనగిరి : రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy) నిరంకుశ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్రెడ్డిపై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిపై ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. మంగళవారం ఎక్కడిక్కడ మంత్రి దిష్టి బొమ్మలను(Burning effigy) తగులబెట్టి ఆందోళన చేపట్టారు.
బొమ్మల రామారం( Gajula Ramaram) మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు పోటాపోడిగా దిష్టిబొమ్మల దహనం చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నిరంకుశ వైఖరి మానుకోవాల లేకుంటే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.