కోస్గి, జూన్ 20 : సీఎం రేవంత్రెడ్డి ఇలాకా కోస్గిలో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని ఊరడమ్మ ఆలయంపైకి శనివారం బుల్డోజర్లు దూసుకెళ్లాయి. గత నెల ఓ వర్గంపైకి బుల్డోజర్లను పంపగా.. ఆ వర్గం తీవ్రంగా ప్రతిఘటించిన విషయం తెలిసిందే.. ఈ ఘట న మరిచిపోకముందే మరోసారి ఎ లాంటి సమాచారం లేకుండా ఆలయంపైకి జేసీబీని పంపారు. రోడ్డు విస్తరణ పనుల పేరుతో కొంత భాగాన్ని కూల్చడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తా యి. విషయం తెలుసుకొన్న హిందూ సంఘాల నేతలు అక్కడకు చేరుకొని కూల్చివేతలను అడ్డుకొన్నారు. కనీస సమాచారం లేకుండా ఆలయాన్ని ఎలా కూల్చుతారని అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధికి అడ్డొస్తే బాగోదంటూ ఓ కాంగ్రెస్ నేత హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వివిధ పార్టీల నేతలు చేరుకుని కూల్చిన ఆలయ భాగాన్ని యథావిధిగా తిరిగి నిర్మించేవరకు వదిలేది లేదని భీష్మించారు.