ఓ వర్గం సమాధులపైకి బుల్డోజర్లు
సీఎం ఇలాకాలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ వర్గానికి సంబంధించిన సమాధులపైకి బుల్డోజర్లను పంపడంపై నిరసన వ్యక్తమైంది.
- కోస్గి మున్సిపల్ కమిషనర్, చైర్మన్పై ఆ వర్గం పెద్దలు, నాయకుల ఫైర్
- మద్దతు తెలిపిన బీఆర్ఎస్
- సీఎం ఇలాకాలో రెండోరోజూ కూల్చివేతలు
కోస్గి, ఏప్రిల్ 18 : సీఎం ఇలాకాలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ వర్గానికి సంబంధించిన సమాధులపైకి బుల్డోజర్లను పంపడంపై నిరసన వ్యక్తమైంది. శుక్రవారం ప్రభుత్వ ఆస్తులపైకి బుల్డోజర్లతో విరుచుకుపడిన అధికారులు శనివారం ఒక వర్గం సమాధులపైకి జేసీబీలను పంపడం ఉద్రిక్తతకు దారితీసింది.
ముందస్తు సమాచారం లేకుండా శ్మశానవాటిక ప్రహరీ కూల్చడంతో మున్సిపల్ కమిషనర్, చైర్మన్పై ఆ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం ఇలాకాలో ఇలాంటి చర్యలు సరికావని మండిపడ్డారు. సమాధులు ఉన్నాయని తెలిసి.. ఎవరూలేని సమయంలో తమ పెద్దల గుర్తులను చెరిపేయడం సరికాదంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు.
బీఆర్ఎస్ నాయకులు వెంకట నర్సింహులు, నరేందర్రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్, బెజ్జు నీలప్ప, కోనేరు సాయప్ప, ఎర్ర కిష్టప్ప, మాధవరెడ్డి, బాలరాజు కూల్చివేతలను పరిశీలించారు. ఇదేమి ప్రజాపాలన అంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తామంతా అభివృద్ధికి అడ్డుకామని.. ప్రజలకు తెలిసేలా ప్రగతి చేయాలని కోరినా అధికార పార్టీ నేతల అండదండలతో అధికారులు ఒంటెత్తు పోకడ పోతున్నారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

