కొండాపూర్ : రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొండాపూర్( Kondapur ) లో ఏడంతస్తుల భవనం ( Building collapses) శనివారం మధ్యాహ్నం కుప్పకూలింది. అయితే శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో అగ్నిమాపక, పోలీసుల బృందం గాలింపు మొదలు పెట్టారు. నాలను అనుకుని అక్రమంగా తక్కువ స్థలంలో ఏడు అంతస్తులతో నిర్మిస్తున్న భవన్ ఒక్కసారిగా కుప్పకూలి పక్కనే ఉన్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి.

Collapse Building
మాదాపూర్ సర్కిల్ పరిధిలోని అంజయ్య నగర్ లో 50గజాల స్థలం లో చేపట్టిన అక్రమ నిర్మాణం పూర్తిగా కుప్పగిలింది. భవనంలో మనుషులు ఉన్నారా, లేదా అన్నది ప్రశ్నగా మారింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కనే ఉన్న వైట్ ఫీల్డ్ లో ఉన్న మరో అపార్ట్మెంట్పై కూలింది. ఆ భవనం సైతం దెబ్బతిన్నది. మరో పక్కనే ఉన్న హాస్టల్ లోని అందరూ పరుగులు తీసినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సిం ఉంది.