Madhuri Rathod | వేములవాడ పట్టణంలో ఇటీవల జరిగిన ఒక వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఫోక్ సాంగ్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్టిస్టులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ల వ్యక్తిగత వ్యవహారం బహిరంగంగా రచ్చకెక్కింది. ఇటీవలే విడుదలైన ‘ప్రమీల’ అనే ఫోక్ సాంగ్‌లో ఈ ఇద్దరూ జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు. అయితే, ఆ పరిచయం కాస్తా వ్యక్తిగతంగా మారడంతో ఒక హోటల్లో వారు ఏకంతంగా ఉండగా.. వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది ఈశ్వర్ భార్య శరణ్య. దీంతో ఈ పంచాయితీ ఒక్కసారిగా ఇంటర్నెట్ మొత్తం వ్యాపించింది.
అయితే ఈ ఘటన అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన ఫోక్ సాంగ్స్ ఆర్టిస్ట్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించారు. తనపై అకారణంగా దాడి చేశారని ఆమె వేములవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా, ఎలాంటి కారణం లేకుండా తనపై చేయి చేసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై భౌతిక దాడి చేయడమే కాకుండా, అక్కడి దృశ్యాలను వీడియోలు తీశారని, అంతేకాకుండా తన ఐఫోన్‌ను కూడా దొంగిలించారని ఆమె ఆరోపించారు.
అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మాధురి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు పోస్టులు పెడుతూ పరువు నష్టం కలిగిస్తున్న వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. మాధురి రాథోడ్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన వేములవాడ పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
భార్యకు పట్టుబడ్డ ఫోక్ సాంగ్ ఆర్టిస్టులు
ఫోక్ సాంగ్స్ యాక్టర్స్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్‌ను నిన్న అర్థరాత్రి సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఈశ్వర్ సాయి భార్య
ఇటీవల ప్రమీల ఫోక్ సాంగ్‌లో ప్రధాన నటీనటులుగా నటించిన మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి pic.twitter.com/FNmtrKUA7E
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2026