Teacher Awards | ఢిల్లీ: దేశ వ్యాప్తంగా పాఠశాల విద్య (School Education), అక్షరాస్యత కోసం విశేష కృషి చేసిన 48 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులను ప్రభుత్వం గుర్తించింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంలో, విద్యార్థులను తీర్చిదిద్దడంలో చూపిన నిబద్ధత, అంకితభావాలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. 27 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వీరిని ఎంపిక చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెల్లడించింది. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో వీరికి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజు సెప్టెంబర్ 5న అవార్డులను అందజేస్తారు.

President Draupadi Murmu
ఎంపికయినవారు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల (National Best Teachers)కు ఎంపికయినవారిలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. వీరిని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాల నుంచి కేంద్రీయ, నవోదయ విద్యాలయాల వరకు, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అన్ని స్కూళ్ల నుంచి ఎంపిక చేశారు.
1. జే ప్రకాశ్ రావు, అండమాన్ అండ్ నికోబార్
2. రాజేశ్ కొల్లూరి, ఆంధ్రప్రదేశ్
3. యాకు టేమ్, అరుణాచల్‌ప్రదేశ్
4. రాజేశ్ బోర్డోలోయ్, అస్సాం
5. ఖుష్బూ కుమారి, బిహార్
6. పుష్పా ప్రసాద్, బిహార్
7. రాధా రాజేశ్, CISCE
8. సంగీత యాదవ్, CBSE
9. రవి జైస్వాల్, చండీఘర్
10. సునీత యాదవ్, ఛత్తీస్‌గఢ్
11. పటేల్ పూర్ణిమ మోహన్‌లాల్, దాద్రా అండ్ నగర్ హవేలి అండ్ డామన్ అండ్ డయ్యూ
12. సుమన్ గోయెల్, ఢిల్లీ
13. ఎండీ జఫర్ ఆలం, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్
14. మహదేవ్ హనమంత్ షిండే, గోవా
15. నితిన్ కుమార్ మహేంద్రకుమార్ పాఠక్, గుజరాత్
16. అనిల్ కౌశిక్, హర్యానా
17. మంజరి వీ మహాజన్, హిమాచల్‌ప్రదేశ్
18. మొహమ్మద్ అయాజ్ రైనా, జమ్మూ అండ్ కశ్మీర్
19. మున్మున్ భట్టాచార్జీ, జార్ఖండ్
20. ఎస్ రత్నకుమారి, కర్నాటక
21. జే అముత, కేంద్రీయ విద్యాలయ సంఘటన్
22. డాక్టర్ మనీష ఖేత్రపాల్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్
23. కేపీ సునీల్ కుమార్, కేరళ
24. మొహమ్మద్ ముస్తఫా కుమల్, లడఖ్
25. డాక్టర్ అర్చనా శుక్లా, మధ్యప్రదేశ్
26. శైలేంద్ర ప్రతాప్ సింగ్, మధ్యప్రదేశ్
27. డాక్టర్ కవితా నర్సింగరావు గిట్టే, మహారాష్ట్ర
28. కుందా జయవంత్ బచ్చావ్, మహారాష్ట్ర
29. వాంగ్లేంబమ్ గోబిన్ సింగ్, మణిపూర్
30. లైనున్మావ్లీ, మిజోరం
31. ఆర్ రొనాల్డ్ మేరు, నాగాలాండ్
32. వైభవ్ వసంతరావు కులకర్ణి
33. పదరాజ్ ఉమాకాంత నాయక్, ఒడిషా
34. ఎస్ గణేశన్, పుదుచ్చేరి
35. దినేశ్ కుమార్, పంజాబ్
36. డాక్టర్ దివ్యేందు సేన్, రాజస్థాన్
37. డాక్టర్ వర్టిక గులాటి, రాజస్థాన్
38. శివప్రసాద్ అర్వింద్ తింగారే, సైనిక్ స్కూల్స్
39. సుష్మ తమంగ్, సిక్కిం
40. ఎం తంగరాజ్, తమిళనాడు
41. భవాని బొంపెల్లి, తెలంగాణ
42. రంజన్ దేబ్నాథ్, త్రిపుర
43. డాక్టర్ రేణు త్రిపాఠి, ఉత్తరప్రదేశ్
44. డాక్టర్ ఇఫ్త్కర్ ఖాన్, ఉత్తరప్రదేశ్
45. శాలిని కుష్వాహ, ఉత్తరప్రదేశ్
46. గబర్ సింగ్, ఉత్తరప్రదేశ్
47. పలాష్ చౌధరి, పశ్చిమబెంగాల్
48. శంతను పాత్ర, పశ్చిమబెంగాల్
ఎంపిక ఇలా
విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు (Online Applications) చేసుకోవాలని కోరింది. దీనికి జూన్ 15 నుంచి జూలై 20 వరకు గడువు విధించింది. ఈ దరఖాస్తులను మొదట జిల్లా స్థాయిలో, తర్వాత రాష్ట్ర స్థాయిలో, చివరగా జాతీయ స్థాయిలో పరిశీలించి వీరిని ఎంపిక చేశారు.
తెలంగాణ నుంచి
రాష్ట్రంలోని కామారెడ్డి జల్లాలోని ఉపాధ్యాయురాలు భవాని బొంపెల్లి ఎంపికయ్యారు. ఆమె గాంధారి మండలకేంద్రంలని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. గణితం పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సులభంగా బోధిస్తున్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు తెలంగాణ నుంచి ఆమె ఒక్కరే ఎంపికయ్యారు. ఆమె గతేడాది తెలంగాణ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు.