న్యూఢిల్లీ: ఢిల్లీలో భార్య బంధువులు దాడి చేయడంతో.. 31 ఏళ్ల టెకీ భర్త చనిపోయాడు(Techie Killed). ఈ ఘటన నిహాల్ విహార్‌లో శుక్రవారం జరిగింది. ఈ కేసులో నలుగుర్ని పోలీసులు అరెస్టు చేశారు. లక్ష్మీ పార్క్‌లో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ వినయ్ గుప్తా.. మూడున్నర ఏళ్ల క్రితం బుద్ విహార్‌లో ఉంటున్న రేఖను పెళ్లి చేసుకున్నాడు. నాలుగున్నర నెలల క్రితం ఆ జంటకు కవల పిల్లలు పుట్టారు. శుక్రవారం ఉదయం జంట మధ్య గొడవ జరిగింది. పిల్లలకు మెడిసిన్ ఇచ్చే అంశంలో ఘర్షణ జరిగినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆమె తన ఫ్యామలీకి ఫోన్ చేసింది. గుప్తా ఇంటికి భార్య బంధువులు చేరుకున్నారు. ఇంటి బయట వినయ్ గుప్తాపై అటాక్ చేశారు. తీవ్రగాయాలు కావడంతో గుప్తాను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అతను అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తేల్చారు. బీఎన్ఎస్లోని 103(1), 3(5), సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. దాడికి సంబంధించిన కేసులో నిందితులను ప్రశ్నిస్తున్నారు. నోయిడాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీ అడోబ్‌లో ఇంజినీర్‌గా గుప్తా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవకు కారణం ఏంటన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.