ఒక వైపు రోజులు లెక్కిస్తూ
దశాబ్ద కాలపు అధికార కల
గండం గడిచి గట్టెక్కినట్టు
మరోవైపు వెయ్యి రోజుల సంబురం!
ఎవరు పైకి లేస్తే
ఏ కుర్చీ మాయమో
అయోమయ కాలంలో
ఉత్సవాల ఉత్సాహాలు ఎండమావే!
చెప్పుకొనే గొప్పలు లేనప్పుడు
అడుగడుగునా కటౌట్లు
ఆకర్షణీయంగా వెలుస్తాయి!
తలకిందులుగా వేలాడదీసిన కోళ్లు
జనం ఆకలిని తీర్చకపోగా
ఆగ్రహాన్ని రెండింతలు చేస్తాయి!
ఆశల రాశులు
కుప్పలు కుప్పలుగా గుమ్మరిస్తున్నప్పుడే
బరువు బేరీజు వేసుకోవాల్సింది
అడుసు తొక్కాక కాళ్లు కడుక్కోవాల్సిందే!
ప్రత్యర్థులు ఒకవైపు
సమర శంఖాలు పూరిస్తుంటే
మేలుకొలుపు గీతాలతో
రాష్ట్రమంతా ఇకపై
లాంగ్ మార్చ్ షురూ!!
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261