హైదరాబాద్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నీటి పారుదల, గిరిజన సంక్షేమం, ఇతర శాఖల్లో చేసిన పనులకు చెందిన రూ.20వేల కోట్లు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) రాష్ట్ర చైర్మన్ వీ రవీందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సెక్రటేరియట్ మీడి యా సెంటర్ వద్ద ఆయన మా ట్లాడారు.
కాంట్రాక్టర్లకు స మస్యను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ నెల 18 చలో హైదరాబాద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు. బిల్లుల టోకెన్లు జారీ అయినా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేద ని వాపోయారు. బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం కారణం గా చిన్న, మధ్యతరహా కాంట్రాక్టర్లు బ్యాంకు లోన్లు చెల్లించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
నష్టాలు, తక్కువ టర్నోవర్ కారణంగా అనేక కాంట్రాక్టర్లు కొత్త టెండర్లకు అర్హత కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. కంపెనీలు మూతపడటంతో వేలమంది ఉద్యోగాలను కోల్పోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఏఐ ఆల్ ఇండి యా వైస్ ప్రెసిడెంట్ వీ సత్యమూర్తి ఆల్ ఇండియా మాజీ వైస్ చైర్మన్ డీవీఎన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ పాల్గొన్నారు.