ప్రజాపాలనలో బడా వ్యాపారులకే బిల్లులా.. కాంట్రాక్టర్లకు 25 వేల కోట్ల బకాయిలు ఇవ్వరా?
కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర్లు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు.
- సర్కార్ తీరుకు నిరసనగా 18న ‘చలో హైదరాబాద్’
- బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి
నిజామాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రజా పాలనలో బడా వ్యాపారులకే బిల్లులు మంజూరు అవుతున్నాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆరోపించారు. బిల్లులు రాక ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర్లు చనిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. చిన్న, మధ్యతరగతి కాంట్రాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి తమ సమస్యలను తెలియజేసేందుకు ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్‌లో సన్నాహక సమావేశం నిర్వహిం చి, చలో హైదరాబాద్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రవీందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రూ.25 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. నో పేమెంట్.. నో వర్క్.. స్లోగన్‌తో కార్యాచరణను సిద్ధం చేశామని తెలిపారు.
మాకెందుకు బిల్లులు ఇవ్వరు..?
తెలంగాణలో మేఘా, నవయుగ లాంటి ఆంధ్రా కంపెనీలకు రూ.కోట్లలో బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తున్నదని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి భాస్కర్‌రెడ్డి తెలిపారు. మిగిలిన కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లుల చెల్లింపుల్లో కాలయాపన చేయడం సరికాదన్నారు. బి ల్లుల జాప్యంతో 10 మంది కాంట్రాక్టర్లు చనిపోయారని ఆవేదన చెందారు. సమావేశంలో బీఏఐ కోకన్వీనర్లు విష్ణువర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

