హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. నగరంలోని సనత్ నగర్ లో రూ. 3.87 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడారు.
అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లను, మేలైన పాలనను అందిస్తున్న ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. బీ(టీ)ఆర్ఎస్ ప్రభుత్వం చొరవతోనే మునుగోడు ప్రజలకు ఫ్లోరిన్ భూతం నుంచి శాశ్వత విముక్తి లభించిందని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా ఫ్లోరిన్తో ఇబ్బందులు పడి దివ్యాంగులుగా మారిన ప్రజల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మిషన్ భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారని కొనియాడారు. ఐబై సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ నల్గొండలో ఫ్లోరిన్ సమస్యను పరిష్కరించలేకపోయిందని ఆరోపించారు.