శేరిలింగంపల్లి, ఆగస్టు 18: తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఆందోళన సోమవారంతో 34వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు రోజుకో తీరులో ఆందోళన చేపడుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉద్యోగులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
తమ భూములు తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీటీఎన్జీవో హౌసింగ్ సోసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ అధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలో పలువురు ఉద్యోగ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు.