తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న భాగ్యనగర్ టీఎన్జీవోల ఆందోళన శనివారంతో 39వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు నిరసన చేపట్టారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని, తమ భూములు తమకే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ అధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలో రాజేశ్వర్రావు, మల్లారెడ్డి, శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, రషీదా బేగం, సంధ్య, నర్సింహారాజు, ఎక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
– శేరిలింగంపల్లి