BTech Seats | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది బీటెక్ కోర్సుల్లో 19,278 సీట్లకు కోతపడింది. ఈ సీట్లన్నీ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలవే కావడం గమనార్హం. ప్రైవే ట్ కాలేజీలు కోర్సుల కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం అనుమతించలేదు. నిరుడు 1.17 లక్షల ఇంజినీరింగ్ సీట్లుండగా, ఈ ఏడాది 98వేలకు తగ్గాయి. ఇంజినీరింగ్‌లో కోర్ సహా కొన్ని ఎమర్జింగ్ కోర్సులకు కాలేజీలు గుడ్‌బై చెబుతున్నాయి. ఆయా కోర్సులను సీఎస్ఈ కోర్సుల్లో విలీనం చేస్తున్నాయి. ఐదేండ్లలో కోర్ బ్రాంచిల్లో 10 వేలకు పైగా సీట్లు తగ్గగా, అదే స్థాయిలో ఎమర్జింగ్ కోర్సుల్లో సీట్లు పెరిగాయి.
మూడేండ్లుగా సీట్ల సంఖ్య పెరుగుతుండగా, ఈ ఏడా ది మాత్రం 20వేల సీట్లకు కోతపడింది. అయి తే ప్రభుత్వ కాలేజీల్లో ఏటా బీటెక్ సీట్లు పెరుగుతున్నాయి. ఈ ఐదేండ్లలో 2,739 సీట్లు పెరిగాయి. గత బీఆర్ఎస్ సర్కారు సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, మహబూబాబాద్‌లో కొత్త కాలేజీలను నెలకొల్పింది. రేవంత్ సర్కారు సైతం కొడంగల్‌లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటుచేసింది. దీంతో ప్రభుత్వ కాలేజీల్లోని సీట్లసంఖ్య పెరిగింది.నాలుగేండ్లుగా ప్రైవేట్ కాలేజీల్లో నూ ఏటా సీట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ విద్యాసంవత్సరానికి వచ్చేసరికి సీట్ల సంఖ్య 92వేలకు చేరింది.