మేడ్చల్, జనవరి 24 : గుర్తుతెలియని యువతి దారుణ హత్యకు గురైన ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మునీరాబాద్ సమీపంలో ఔటర్‌రింగు రోడ్డు కల్వర్టు కింద 25 ఏండ్ల యువతి హత్యకు గురైనట్టు గుర్తించిన స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో మహిళను దుండగులు బండరాయితో తలపై మోదీ హత్యచేసి, ఆ తర్వాత మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పటించినట్టు తేల్చారు. యువతి చేతులపై శ్రీకాంత్, నరేందర్, రోహిత్ అని టాటూలు ఉన్నట్టు గుర్తించారు. ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ సత్యనారాయణ క్లూస్‌టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.