Kamareddy | వివస్త్రను చేసి కారం కొట్టి.. దళిత మహిళపై పాశవిక దాడి
సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొందరు ఓ దళిత మహిళను వివస్త్రను చేసి జననాంగాల్లో కారం కొట్టి చిత్రహింసలకు గురి చేశారు.
- కామారెడ్డి జిల్లాలో దళిత మహిళపై పాశవిక దాడి
- వివాహేతర సంబంధం ఆరోపణలపై అకృత్యం
- ఆలస్యంగా ఘటన వెలుగులోకి
- ఘటనలో కాంగ్రెస్ నేతలప్రమేయం.. కేసు నమోదు చేయని పోలీసులు
Kamareddy | నిజామాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సభ్య సమాజం తల దించుకొనే దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. దళితురాలిని వివస్త్రను చేసి కారం చల్లి చితకబాదిన ఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో సంచలనంగా మారింది. వివాహేతర సంబంధం ఘటనలో కొందరు ఓ దళిత మహిళను వివస్త్రను చేసి జననాంగాల్లో కారం కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. గ్రామంలో నడిబజారులో అందరు చూస్తుండగానే చెట్టుకు కట్టేసి కొట్టారు. మూడు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. రామారెడ్డి మండలానికి వలస వచ్చి బతుకుతున్న జంటపై తొలుత దాడి చేశారు.
ఇక్కడ్నుంచి మాచారెడ్డి మండలంలోని మరో గ్రామానికి బాధిత జంటను పట్టుకెళ్లి అక్కడే చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడగా మరుసటి రోజు వారిని కొందరు దవాఖానకు తీసుకెళ్లినట్టు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో చెలరేగిన వివాదంతో ఇదంతా జరిగినట్టు సమాచారం. అయితే, ఈ దారుణంపై పోలీసులు నోరు మెదపడం లేదు. దాడికి పాల్పడింది కాంగ్రెస్ పార్టీకి చెందినవారని గ్రామస్థులు చెప్తున్నారు. అధికార పార్టీకి చెందిన వారు కావడంతోనే పోలీసులు కేసు నమోదు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నట్టు తెలిసింది. ఈ ఘటన బాహ్య ప్రపంచానికి తెలిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే కారణంతో పోలీసులు జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. రామారెడ్డి, మాచారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన ఈ అమానవీయ ఘటనపై కేసు నమోదు చేశారా.. లేదా? అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు స్పందించడం లేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

