Auto Drivers| కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆటోడ్రైవర్లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఉండేందుకు రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే పలువురు ఆటో డ్రైవర్లను, యూనియన్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఆటో డ్రైవర్ల అరెస్టును ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ల జేఏసీ తీవ్రంగా ఖండించింది. పోలీసులు ఎన్ని నిర్బంధాలు చేసినా అసెంబ్లీని ముట్టడిస్తామని బీఆర్టీయూ నేత వేముల మారయ్య స్పష్టం చేశారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అరెస్టు చేసిన ఆటో డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.