హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): విద్యా వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు ధ్వజమెత్తారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయమని అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆహారంలో బ్లేడ్లు రావటం దురదృష్టకరమని మండిపడ్డారు.