హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఒక సీటు కూడా గెలువనివ్వనని ప్రగల్భాలు పలకడం సీఎం రేవంత్రెడ్డి రాజకీయ అపరిపక్వతకు అద్దంపడుతున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు తుంగబాలు విమర్శించారు. రేవంత్రెడ్డి రాష్ర్టానికి ముఖ్యమంత్రిలా కాకుండా ప్రతిపక్ష నాయకుడి మాదిరిగా వ్యవహరిస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 420 హామీలను అమలు చేయలేక రేవంత్రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ కనీసం 50 స్థానాలు కూడా గెల్చుకోలేని స్థితిలో సర్కస్ఫీట్లు చేస్తున్నదని ఎద్దేవా చేశారు.