ఎమ్మెల్సీ కవిత పరువుకు భంగం కలిగేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు.
ఈ పోస్టులకు టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రాంమోహన్రెడ్డిదే బాధ్యత అని, ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.