Group-1 | సీఎం రేవంత్ రాజీనామా చేయాలి.. ఓయూలో బీఆర్ఎస్వీ ఆందోళన
Group-1 | గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నిరుద్యోగ విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసన తెలిపింది.
Group-1 | హైదరాబాద్ : గ్రూప్ – 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నిరుద్యోగ విద్యార్థులతో కలిసి శాంతియుత నిరసన తెలిపింది. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కడారి స్వామి యాదవ్ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అడిగే వారిని అరెస్టులు చేయడం కాదు.. గ్రూప్ -1పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జీవో నెం 29 రద్దు చేయాలి జీవో నెం 55 ఇంప్లీమెంటేషన్ చేయాలి. గ్రూప్ -1పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి. హైకోర్టు చెప్పినట్టుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ చేయాలి అని డిమాండ్ చేశారు.
గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్, కమిషన్ అధికారులు వెంటనే రాజీనామా చేయాలి. లేకుంటే ప్రభుత్వంపై యుద్ధం చేయక తప్పదు. గ్రూప్ -1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్వీ పోరాటం చేయక తప్పదు అని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అని కడారి స్వామి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు చటారి దశరథ్, జంగయ్య, నాగారం ప్రశాంత్, బొల్లు నాగరాజ్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు, రాకేష్, సాయి గౌడ్, సంజయ్, రాము తదితర విద్యార్ధి నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

