Nemmadi Sravan Kumar : ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని వేధిస్తున్న కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గపు వైఖరిని బీఆర్ఎస్వీ నేతలు ఖండించారు. కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించారు.
ఈ సందర్బంగా బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం లేకుండా 65 సంవత్సరాలు దాటిన కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో వేధించడం మూర్ఖత్వమని అన్నారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులను సిట్ విచారణ పేరిట ఇబ్బంది పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం నీచమైన చర్య అని శ్రావణ్ కుమార్ విమర్శించారు.
ఫోన్ ట్యాపింగ్‌కు కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకున్నా.. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అక్రమాలను దృష్టి మళ్లించడానికే ఈ సిట్ విచారణ చేపట్టారని ఆయన మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి పాలన 25 మాసాలు 65 మోసాలుగా సాగుతున్నది. రాష్ట్రంలో స్కీముల పేరిట స్కామ్‌లకు పాల్పడుతూ ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి సిట్ పేరిట డ్రామాలాడుతున్నాడు. క్యాలెండర్లు మారుతున్నాయి కానీ ఇప్పటి వరకు ఒక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు.
నిరుద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారు. అవీనీతి, కుంభకోణాలను బయటపెడుతున్నందుకు కేసులు, నోటీసులు, విచారణలు అంటూ వేదిస్తున్నారు. ఇచ్చిన హామీలు ప్రకటించిన గ్యారెంటీలు అమలు చేయకుండా కాలం వెళ్లదీస్తున్నది కాంగ్రెస్ సర్కార్’ అని శ్రావణ్ కుమార్ ధ్వజమెత్తారు.
కేసీఆర్‌ను సిట్ విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ నేతలు మినిస్టర్స్ క్వార్టర్స్‌ను ముట్టడించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు నెమ్మాది శ్రావణ్ కుమార్ కడారి స్వామి యాదవ్, తుంగ బాలు, చాటారీ దశరథ్, జంగయ్య, యశ్వంత్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ ముదిరాజ్, నాగేందర్ రావు,నితీష్, నర్సింగ్, జై కృష్ణ, రాజు, కిరణ్, రాజు యాదవ్, ప్రశాంత్, రెహమాత్, సాయి గౌడ్,రవి కిరణ్, విశాల్ జూపల్లి రాము, కనీష్లను అరెస్ట్ చేసి కంచన్ బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.