హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఈ నెల 21న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం, బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 19న ముగియనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొనేందుకు వీలుగా, తొలుత ప్రకటించినట్టు 19న కాకుండా 21వ తేదీకి బీఆర్ఎస్ఎల్పీ మీటింగ్‌ను వాయిదా వేశారు.
అధినేత కేసీఆర్ ఆదేశం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ అధ్యక్షత 21న నిర్వహించే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ్యులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.