BRS | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనున్నది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన ప్రజా సమస్యలపై సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.