కల్వకుర్తి రూరల్, అక్టోబర్ 1 : కల్వకుర్తిలో(kalvakurthi) కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల వద్ద ఉన్న సత్యసాయినగర్ సూర్యలత స్పిన్నింగ్ మిల్లులో(Cotton mill elections) గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ (భారత రాష్ట్ర సమితి కార్మిక వర్గం) ఘన విజయం సాధించింది. సీఎం రేవంత్ సొంత జిల్లాలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి ఓటమి చెందాడు. కాంగ్రెస్ ఐఎన్టీయూసీ అభ్యర్థి ఆనంద్‌కుమార్‌పై బీఆర్ఎస్కేవీ(BRSKV) బలపర్చిన అభ్యర్థి సూర్యప్రకాశ్‌రావు కార్మిక సంఘం అధ్యక్షుడిగా గెలుపొందారు.
మంగళవారం కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 450 ఓట్లకుగానూ 439 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సూర్యప్రకాశ్‌రావుకు 251, ఆనంద్‌కు 183 ఓట్లు పోలవగా.. 4 ఓట్లు చెల్లనవిగా నమోదు కాగా 68 ఓట్లతో సూర్య విజయ ఢంకా మోగించారు. దీంతో అభిమానులు, కార్మికులు సంబురాల్లో మునిగిపోయారు.
కాటన్‌మిల్లు నుంచి కల్వకుర్తి వరకు భారీ ర్యాలీ చేపట్టి పటాకులు కాల్చుతూ.. డ్యాన్స్‌లు చేశారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గెలుపు సంబురాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్కేవీకి ఓటేసి గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఇందుకు ఈ ఎన్నికల్లో ఓటమే నిదర్శనమన్నారు.