KTR | మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు గొడ్డుకారం అన్నం పెట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు 32వేలు మాత్రమే.. అదే చదువుకునే విద్యార్థులకు మాత్రం గొడ్డుకారంతో భోజనం పెడతారని విమర్శించారు. వారెవ్వా ప్రజా పాలన.. శభాష్ ఇందిరమ్మ రాజ్యం అంటూ ఎద్దేవా చేశారు.
నల్లగొండ జిల్లాకేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్ విద్యార్థినులకు గొడ్డుకారం అన్నం బ్రేక్‌ఫాస్ట్‌గా అందించారు. వర్సిటీలోని కృష్ణవేణి బాలికల వసతి గృహంలో మంగళవారం విద్యార్థినులకు బ్రేక్ ఫాస్ట్‌గా అన్నంతోపాటు గొడ్డుకారం పెట్టారు. విద్యార్థులు ప్లేట్లతో క్యూలో ఉండగా అన్నం, కారం బేసిన్, ఉప్పు డబ్బా పక్కనే ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎంజీయూలో కారం అన్నమే బ్రేస్ట్‌ఫాస్ట్ అంటూ చక్కర్లు కొట్టాయి.
ఇంతకంటే ఘోరమా!!
ఆడ పిల్లలకు గొడ్డు కారంతో అన్నం పెడతారా!
నల్గొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ఉదయం గొడ్డు కారంతో టిఫిన్ పెడుతున్న యాజమాన్యం
నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలోని కృష్ణవేణి హాస్టల్లో ఉదయం టిఫిన్ సందర్భంగా విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం… pic.twitter.com/LsjtDXWyce
— Telugu Scribe (@TeluguScribe) January 7, 2025
కాగా, సాయంత్రానికి అదే విద్యార్థినులతో బ్రేక్‌ఫాస్ట్‌లో బోండా పెట్టారని, తామే కారం అన్నం అడిగామని లెటర్ విడుదల చేయించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు మాలధారణలో ఉన్నారని, చలికాలం కావడంతో కూర ఉన్నప్పటికీ కారం అడగడం వల్లే ఇచ్చామని హాస్టల్ సిబ్బంది వివరణతో మరో లెటర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత హాస్టల్ డైరెక్టర్లు దోమల రమేశ్, కళ్యాణి కలిసి వార్డెన్లు రాజేశ్వరి, జ్యోతితో ప్రత్యక్ష పరిశీలన చేయించామని చెప్తూ మరోసారి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.