సిరిసిల్ల రూరల్, జూలై 21 : సిరిసిల్లలో ఎట్టకేలకు అధికార యంత్రాంగం, ప్రభుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడి, ఆందోళనలకు అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన మైన రేషన్ కార్డుల పంపిణీలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ర్ ఫొటో ఏర్పాటు చేయడం గమనార్హం. సిరిసిల్ల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌పై అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యహరిస్తున్న విషయం తెలిసిందే. కలెక్టర్ ప్రొటోకాల్ పాటించడం లేదని ఎస్పీకి బీఆర్ఎస్ సీనియర్ నేత, జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదుచేశారు.
అనేకసార్లు అందోళనలు చేశారు. దీంతో సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలోని జిల్లా రైతు వేదికలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఎమ్మెల్యే కేటీఆర్, కేంద్రమంత్రి, ఎంపీ బండి సంజయ్ ఫొటోలు ఏర్పాటు చేసి, ఎలాంటి పదవిలేని కాంగ్రెస్ నేత కేకే మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కార్యక్రమం నిర్వహించారు. రేషన్ కార్డులను సైతం ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయించడం నియోజకవర్గంలో మరోసారి చర్చానీయాంశంగా మారింది.