KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా-ఈ కేసు విచారణ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్ చేరుకుంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ జనవరి 9వ తేదీన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాడు దాదాపు ఆరున్నర గంటల పాటు కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. తన లాయర్ రామచంద్రరావుతో కలిసి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.