KTR | అమ్మమ్మ ఊరిపై కేటీఆర్ మమకారం.. ఆమె జ్ఞాపకార్థంగా స్కూల్ భవనం..
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన అమ్మమ్మ, తాత జ్ఞాపకార్థంగా.. సకల సదుపాయాలతో రెండు అంతస్తుల స్కూల్ బిల్డింగ్‌ను కట్టించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. తన అమ్మమ్మ, తాత జ్ఞాపకార్థంగా.. సకల సదుపాయాలతో రెండు అంతస్తుల స్కూల్ బిల్డింగ్‌ను కట్టించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాను. అమ్మమ్మ లక్ష్మీ, తాత జే కేశవరావు జ్ఞాపకార్థం.. తన వ్యక్తిగతంగా కొత్త పాఠశాల భవనాన్ని నిర్మించాను. కొన్ని తుది మెరుగులు మినహా ఈ భవనం దాదాపు పూర్తయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని కొదురుపాకలో ఈ స్కూల్ భవనాన్ని నిర్మించినట్లు కేటీఆర్ తెలిపారు.
కొదురుపాక ఆర్అండ్ఆర్ కాలనీలో జడ్పీ పాఠశాల మాత్రమే నిర్మాణం జరిగింది. దీంతో ప్రాథమిక పాఠశాలను జడ్పీ స్కూల్ ఆవరణలో కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్నకేటీఆర్ తన అమ్మమ్మ, తాతయ్య జోగినపల్లి లక్ష్మీ కేశవరావు జ్ఞాపకార్థం తన సొంత నిధులతో జడ్పీ స్కూల్ ఎదుట ఉన్న 20 గుంటల స్థలంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని నిర్మిస్తానని గతంలో ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు, సంతోష్‌కుమార్ తండ్రి రవీందర్‌రావుతో కలిసి భూమి పూజ చేశారు.
A promise made must be a promise kept😊
Had committed to building a new School building in my personal capacity in memory of my maternal grandparents Sri J. Keshava Rao Garu and Smt. Lakshmi Garu
It’s almost done barring a few final touches. Will be ready for students starting… pic.twitter.com/RwxD10YaT7
— KTR (@KTRBRS) April 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- KCR
- kodurupaka
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

