KTR | వనపర్తి : కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్మీపల్లికి చేరుకున్నారు. శ్రీధర్ రెడ్డి మృతదేహానికి కేటీఆర్ నివాళులర్పించారు. శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించారు.
చిన్నంబావి మండల కేంద్రంలో శ్రీధర్ రెడ్డి డెడ్‌బాడీతో కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మన్నె క్రిశాంక్, రంగినేని అభిలాష్ రావుతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. హత్య రాజకీయాలు మానుకోవాలి, నిందితులను వెంటనే శిక్షించాలని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యను నిరసిస్తూ చిన్నంబావి మండల కేంద్రంలో మృతదేహంతో రాస్తారోకో చేసి, ర్యాలీగా మృతదేహాన్ని లక్ష్మీపల్లి గ్రామానికి తీసుకెళ్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
నిరసన ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి శ్రీనివాస్… pic.twitter.com/BGHCMouxIU
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2024