ఎల్కతుర్తి, ఏప్రిల్ 21: రజతోత్సవ సభ పండుగ వాతావరణంలో జరుగుతుందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. సోమవారం ఎల్కతుర్తి సభాప్రాంగణాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్‌లు అయిపోయాయని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 లక్షల మంది అనుకుంటే 3లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు, అన్ని పార్టీలు సభకు సహకరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్‌ను చూడాలని, ఆయన మాట వినాలను ఈ నెల 27 కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ఈ నెల 22న పనులు పరిశీలించేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభాస్థలికి వస్తారని తెలిపారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల పార్టీ అని, బ్రహ్మాండంగా రజతోత్సవ సభ జరుగుతుందని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. 165 ఎకరాల్లో సభాప్రాంగణం పనులు పూర్తికావచ్చాయని, పార్కింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు.
సభపై ప్రభుత్వ కుట్రలు
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బబ్బూరి శ్రీకాంత్ గౌ డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేళాకు 1500 మంది నిరుద్యోగ యువత తరలిరాగా, ఆన్లైన్లో 1500 మంది పాల్గొన్నారని, 246 మందికి అపాయింట్మెంట్స్ అందించామని చెప్పారు.