KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు తెచ్చుకున్న మలావత్ పూర్ణ తండ్రి దేవీదాస్ కన్నుమూయడంతో, కేటీఆర్ ఆమెను ఓదార్చారు.
కేటీఆర్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల బిజీలో ఉన్నప్పటికీ, ఈ విషాద వార్త తెలుసుకుని వెంటనే నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలం, పాకాల గ్రామంలో ఉన్న పూర్ణకు కాల్ చేశారు. పూర్ణ తండ్రి మరణం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పూర్ణకు ధైర్యం చెప్పిన కేటీఆర్, త్వరలోనే స్వయంగా వచ్చి ఆమె కుటుంబాన్ని కలవనున్నట్లు హామీ ఇచ్చారు.
ఎవరెస్ట్ గిరిపుత్రిక మలావత్ పూర్ణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పరామర్శ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఎవరెస్ట్ అధిరోహకురాలు మలావత్ పూర్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గిరిపుత్రికగా పేరు… pic.twitter.com/AmVEGqACju
— BRS Party (@BRSparty) November 13, 2025