KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) సోషల్ మీడియా (Social Media) లో చేసిన ఆసక్తికరమైన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ఫొటోను ఆయన పంచుకోవడమే ఇందుకు కారణం అయ్యింది.
కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో తండ్రి కేసీఆర్ లైఫ్సైజ్ ఫొటోను పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో కేసీఆర్ మెడలో గులాబీ కండువాతో ఓ కుర్చీలో కూర్చుని ఉండగా ఆయన కాళ్ల వద్ద ఓ శునకం కూర్చుని ఉంది. ఈ ఫొటోకు ఆయన ‘IYKYK’ అనే చిన్న క్యాప్షన్ జోడించారు. ‘If You Know, You Know’ అనే ఆంగ్ల వాక్యానికి ఇది సంక్షిప్త రూపం. ‘తెలిసిన వాళ్లకు దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు’ అనే అర్థాన్ని ఇది సూచిస్తుంది.
కేటీఆర్ ఈ పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ‘కేటీఆర్ ఈ ఫొటోను ఇప్పుడు ఎందుకు పంచుకున్నారు? ఈ క్యాప్షన్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి?’ అంటూ నెటిజన్లు రకరకాల ఊహాగానాలతో కామెంట్లు చేస్తున్నారు. కొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తుండగా.. మరికొందరు తమకు తోచిన విధంగా అర్థాలు చెబుతున్నారు.
మొత్తానికైతే ఎలాంటి వివరణ లేకుండా కేటీఆర్ పెట్టిన ఈ ఒక్క పోస్ట్ బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్రమైన క్యూరియాసిటీని రేకెత్తించింది. దీనిపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తున్నది.