KTR | హైదరాబాద్ : నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది.. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లోనే టీడీఆర్ల బ్లాక్ దందా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో కొత్త టీడీఆర్ల జారీ నిలిపివేసి, కాంగ్రెస్ గద్దలు కృత్రిమ కొరత సృష్టించి వేల కోట్లు దండుకుంటున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అసలే డిమాండ్ లేక మూలుగుతున్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ నేతలు తమ అవినీతితో ఉన్న ఊపిరి తీస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది. ఇప్పుడది తీవ్ర రూపం దాల్చి వేలకోట్ల భారీ కుంభకోణం అయ్యింది.
రాష్ట్రంలో ముఖ్యనేత అనుచరుడి కనుసన్నల్లోనే టీడీఆర్ల బ్లాక్ దందా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీలో కొత్త… pic.twitter.com/ufWMR1jaS6
— KTR (@KTRBRS) October 4, 2025