KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ వెంట్రుకను కూడా పీకలేడు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్కే భవన్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ అంటే ఒక చరిత్ర.. ఇరిగేషన్ విషయంలో కేసీఆర్ను విచారణకు పిలిచారంటే.. హనుమంతుడి ముందు కుప్పిగంతులు లాంటిది. ఇరిగేషన్ మీద కేసీఆర్కు ఉన్న అవగాహన బహుషా ఈ దేశంలోని సమకాలీన రాజకీయ నాయకులలో ఎవరికి ఉండదు. చివరకు ధర్మం, న్యాయమే గెలుస్తది. తెలంగాణను సాధించిన నాయకుడిగా, సస్యశ్యామలం చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతది అని కేటీఆర్ తెలిపారు.
రేవంత్ రెడ్డి కూలగొట్టడానికి వచ్చాడు తప్ప కట్టడానికి రాలేదు. విధ్వంసకరమైన ఆలోచనలతో పేదల ఇండ్లు కూలగొట్టడం, ప్రాజెక్టులను కూలగొట్టడం.. రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులు తప్ప ఈ సన్నాసికి ఏం చేతకాదు అని అర్థమైతుంది. 100 జన్మలు ఎత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లర గాడికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతో గొడవ పడి ఇక్కడ నుండి తరిమిన వాడే కేసీఆర్. రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం చేసినా, ఆయన ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ వెంట్రుక కూడా పీకలేడు. రేవంత్ రెడ్డిని వదిలిపెట్టం.. కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేదాకా వెంటాడుతాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఈ చిల్లర రాజకీయాలను పట్టించుకోవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉండాలి. రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో బట్టలిప్పి నిలబెట్టే రోజులు వస్తాయి. రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుడికి కేబినెట్ అంటే అర్థం కాదు.. కేబినెట్ ఎట్ల పని చేస్తదో తెలియదు. రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం ఆయనకు. విచారణల పేరిట రేవంత్ రాక్షసానందం పొందుతున్నారు. నిజం నిలకడగా తేలుతుంది. కొన్ని రోజులు కాళేశ్వరం అని, ఫోన్ ట్యాపింగ్ అని, ఈ ఫార్ములా అని డ్రామాలు ఆడుతున్నారు. మంత్రి వర్గ విస్తరణ చేయలేని సీఎం.. చివరకు శాఖలు కేటాయించుకోలేని అసమర్థ సీఎం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Live: బీఆర్కేఆర్ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/FZtw8emt04
— BRS Party (@BRSparty) June 11, 2025