KTR | హైదరాబాద్ : మహిమాన్విత పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతర సందర్భంగా అమ్మవారి భక్తులందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రకృతి అందాల నడుమ మంజీరా నది తీరాన వెలిసిన వనదుర్గమ్మ జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా వేల మంది భక్తులు వస్తారని ఆయన పేర్కొన్నారు. శివరాత్రి నుండి మొదలుకొని మూడు రోజుల పాటు వైభవోపేతంగా జరిగే ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని ఆ వనదుర్గా మాత సుభిక్షంగా ఉంచాలని ప్రార్థిస్తున్నానని కేటీఆర్ స్పష్టం చేశారు.