హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): లండన్ టూర్ ఆనందమయంగా సాగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు దశాబ్దకాలంపాటు సాగిన కేసీఆర్ స్ఫూర్తిదాయక పాలనను ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం సదస్సులో వివరించడం ఆనందంగా ఉన్నట్టు ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
కాలికి గాయమై దవాఖానలో చికిత్స పొందుతున్న పీవోడబ్ల్యూ సంధ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘మీరు ఒక యోధురాలు. మీరు కోలుకున్న తర్వాత అదే ఉత్సాహంతో మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారని నాకు నమ్మకం ఉంది’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఒక నిరసన కార్యక్రమంలో నాయకురాలు సంధ్యను పోలీసులు అమానుషంగా తరలించే క్రమంలో ఆమె కాలికి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తున్నది.