KTR | హైదరాబాద్ : మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా “బండెనక బండి కట్టి” తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన అన్నదాతల సంకల్పానికి నా సలాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నాయకత్వంలో.. సూర్యాపేట రైతులు చూపించిన ఈ చైతన్యం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకం అని కేటీఆర్ అన్నారు.
స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీ రామ రక్ష అని మీ ఆశయం ఎలుగెత్తి చాటుతోంది. గులాబీ జెండాను
గుండెల నిండా నింపుకున్న మీరే బీఆర్ఎస్కు కొండంత గుండె ధైర్యం. కాంగ్రెస్ పాలనలో దగాపడ్డ లక్షలాది మంది రైతన్నలే..
రేపు రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పే రథసారథులు అని కేటీఆర్ పేర్కొన్నారు. జై కిసాన్.. జై తెలంగాణ.. అని కేటీఆర్ నినదించారు.
మండుతున్న ఎండలను సైతం
లెక్కచేయకుండా “బండెనక బండి కట్టి”
తెలంగాణ ఇంటి పార్టీ పండుగకు బయలుదేరిన
అన్నదాతల సంకల్పానికి నా సలాం..జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో..
సూర్యాపేట రైతులు చూపించిన ఈ చైతన్యం
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకంస్వీయ రాజకీయ అస్థిత్వమే
తెలంగాణకు… https://t.co/jZyLyzAaO1— KTR (@KTRBRS) April 23, 2025