KTR | హైదరాబాద్ : నిర్మల్ జిల్లాలోని ముఖరా కే గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దుర్గాదేవి నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో కేసీఆర్ పాటలకు స్టెప్పులేస్తూ.. ఈ రాష్ట్రానికి కేసీఆర్ మరోసారి సీఎం కావాలనే ఆకాంక్షను చాటిచెప్పారు. ముఖరా కే మహిళల నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దిస్ ఈజ్ సూపర్బ్ అంటూ ముఖరా కే గ్రామ మహిళలపై ప్రశంసల జల్లు కురిపించారు కేటీఆర్. అద్భుతం.. మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కేటీఆర్ చప్పట్లతో అభినందించారు.
దుర్గాదేవి శోభాయాత్రలో భాగంగా కేసీఆర్, కేటీఆర్ ఫొటోలను కూడా వారు ప్రదర్శించారు. సారే రావాలంటనున్నారు.. కారే కావాలంటున్నారు, దేఖ్లేంగే, రామక్క పాటలకు మహిళలు అద్భుతమైన స్టెప్పులేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ పాటలతో ముఖరా కే గ్రామం దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, గ్రామ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
This is 👌👏👏 https://t.co/gohRQiRdaQ
— KTR (@KTRBRS) October 3, 2025