KTR | హైదరాబాద్ : ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఉప్పల్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించిన మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి మరణం విచారకరం అని పేర్కొన్నారు. రాజిరెడ్డి ఓ నిబద్ధత గల ప్రజా నాయకుడిగా ప్రజల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు అని అన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.