KTR | సిరిసిల్ల రూరల్, జూలై 29 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నేత పడిగెల అనిల్ కుమార్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇటీవలే పడిగెల అనిల్ దవాఖానలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. యశోద దవాఖానలో చికిత్సకు సుమారు రూ. 4.50 లక్షలు సహాయం అందజేశారు. అయినప్పటికీ అనిల్ ప్రాణాలు దక్కక పోవడంతో దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
ఈ మేరకు మంగళవారం రాత్రి తంగళ్లపల్లిలో అనిల్ నివాసానికి వెళ్లి అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు. అనిల్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ భార్య, కొడుకులతో మాట్లాడారు. వారిని బాగా చదువుకోవాలని సూచించారు. ధైర్యంగా ఉండాలనీ, అండగా ఉంటామని పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నేత చీటీ నర్సింగరావు, మండల అధ్యక్షుడు గజ భింకర్ రాజన్న, మాజీ జడ్పీటిసి కోడి ఆంతయ్య, బండి జగన్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణ రెడ్డి, క్యారమ్ జగత్, కేటీఆర్ సేనా మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్, క్యారమ్ జగత్, రామగౌడ్, దుర్గ ప్రసాద్, సంద్యార్నితో పాటు పలువురు నేతలు ఉన్నారు.