KTR | న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఢిల్లీలో జయశంకర్ సార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
కేటీఆర్‌తో పాటు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా జయశంకర్ సార్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో వారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ఉద్యమ సంబంధాన్ని స్మరించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, @vaddirajumprs, దామోదర్ రావు, పార్ధ సారధి రెడ్డి,… pic.twitter.com/uC5PB4amOn
— BRS Party (@BRSparty) August 6, 2025