హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద సందర్భంలో లక్ష్మారెడ్డికి, వారి కుటుంబ సభ్యులందరికీ కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.