KTR : పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) లో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) పరామర్శించారు. ఎవరికీ భయపడవద్దని, మీకు మేం అండగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన వారికి ధైర్యం చెప్పారు. అందరి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆశావర్కర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.
ఇచ్చిన హామీ మేరకు తమ వేతనాన్ని రూ.18 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆశావర్కర్లు సోమవారం హైదరాబాద్లో ధర్నాకు దిగారు. ధర్నాలో ఉన్న ఆశావర్కర్లను చెదరగొట్టేందుకు పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మహిళలు అన్న గౌరవం లేకుండా మగ పోలీసులు వారిపై దౌర్జన్యం చేశారు. చీరకొంగులు లాగి అసభ్యంగా ప్రవర్తించారు. దుర్భాషలాడారు. పోలీసుల దాడిలో గాయపడిన పలువురు ఆశావర్కర్లు ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. కేటీఆర్ వారిని పరామర్శించారు.
మీ తరపున అసెంబ్లీలో మేము కొట్లాడుతాం.
నిన్న పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శించి, దైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. pic.twitter.com/ESeaXb1VEB
— BRS Party (@BRSparty) December 10, 2024
పోలీసుల దాడిలో గాయపడిన ఆశా వర్కర్లను పరామర్శిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
📍 ఉస్మానియా ఆసుపత్రిhttps://t.co/O4fTDN5iSL
— BRS Party (@BRSparty) December 10, 2024
నిన్న పోలీసుల దాడిలో గాయపడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను పరామర్శించి, ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/fMGqgIuvac
— KTR News (@KTR_News) December 10, 2024