హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. మంత్రిగా ఆయన హయాం లో చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచ పటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తి స్తూ, అంతర్జాతీయ వేదికలపై తన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా పిలుపువచ్చింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్య, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన ముద్ర వేసింది. ఈ క్రమంలో అమెరికాలోని న్యూయార్ నగరంలో కొలంబియా బిజినెస్ సూల్లో ఏప్రిల్ 4న జరిగే 21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (ఐబీసీ)లో ప్రసంగించాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ సదస్సు నిర్వహించే విద్యార్థి విభాగం సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ (ఎస్ఏబీఏ) ఈ మేరకు ఆయనను ఆహ్వానించింది.
కేటీఆర్‌ను పిలువడం గౌరవంగా భావిస్తున్నం
భారతదేశ వ్యాపార, ఆవిషరణ, విధాన నిర్ణయ రంగాలపై మేధోమధనం జరిగే ప్రపంచంలోని అత్యున్నత వేదికల్లో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ ఒకటి. 21 ఏండ్ల్లుగా న్యూయార్లో నిర్వహిస్తున్న ఈ సదస్సు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం పోషిస్తున్న పాత్రపై చర్చించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రవాస భారతీయులకు వేదికగా నిలుస్తూ వస్తున్నది. 2026 ఎడిషన్ కాన్ఫరెన్స్‌లో జెరోధా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ప్రధానవక్తగా వ్యవహరించనున్నారు.
ఇటీవ లే హార్వర్డ్ వర్సిటీలో జరిగే హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్‌కు ఆహ్వానం అందిన తరుణంలోనే, ఇప్పుడు కొలంబియా బిజినెస్ సూల్ నుంచి కూడా కేటీఆర్‌కు ఆహ్వానం రావడం విశేషం. కేటీఆర్ నాయకత్వం, విజన్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనం. నిరుడు కూడా ఆయన ఆక్స్ఫర్డ్ ఇండియా వీక్ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించి, తన స్పష్టమైన, ముందుచూపుతో కూడిన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. కేటీఆర్‌ను విశిష్ట వక్తగా ఆహ్వానించడం తమకు దకిన గౌరవంగా భావిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.