సిరిసిల్ల : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల అపారెల్ పార్క్‌ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అపారెల్ పార్క్‌లో తమ హయాంలో వచ్చిన రెండు పరిశ్రమలు మినహా ఇప్పటివరకు కొత్తగా ఒక్కటీ రాలేదని చెప్పారు.
25 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తాము పార్క్ ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. సంక్రాంతి లోపు వర్కర్ టూ ఓనర్ పథకం లబ్ధిదారులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేదంటే 10 వేల మందితో నిరసన కార్యక్రమం చేస్తామని హెచ్చరించారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, రూ.400 కోట్లతో అపారెల్ పార్క్ ఏర్పాటు చేసిది తామేనని గుర్తుచేశాBరు. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదని కేటీఆర్ విమర్శించారు.