KTR | హైదరాబాద్ : దళితులపై చిర్రుబుర్రులాడిన ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జటప్రోల్ గ్రామంలోని సమీకృత గురుకుల పాఠశాల భవనం కోసం దళితుల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంచుకుంది. ఈ నేపథ్యంలో అన్యాయంగా మా భూమిని తీసుకోవద్దని న్యాయం చేయండని వచ్చిన దళితులపై ఇంత కర్కశత్వం ప్రదర్శిస్తారా..? అని కేటీఆర్ మండిపడ్డారు.
బాధిత దళిత బిడ్డలు మీ భూములు ఇవ్వాలని అడగలేదు.. వారికి గతంలో ఇచ్చిన భూములను తీసుకోకుండా న్యాయం చేయండని మాత్రమే అడిగారు. అంత మాత్రాన నోరు మూయ్ అంటూ సెక్యూరిటీని పెట్టి పంపిస్తారా? ఇందిరమ్మ రాజ్యంలో దళితులకు న్యాయం చేయరా…? అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు మొదలవుతుందన్న సహజ సూత్రాన్ని మర్చిపోకండి… ఆ దళిత బిడ్డలే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఘోరి కడుతరు అని జూపల్లి కృష్ణారావును కేటీఆర్ హెచ్చరించారు.
మంగళవారం సదరు స్థలాన్ని పరిశీలిచేందుకు మంత్రి జూపల్లి రాగా, సర్వే నంబర్ 508లో ఎనిమిది ఎకరాల భూమిని నాటి జటప్రోల్ సంస్థానాధీశులు రాజా జగన్నాథరావు తమకు ఇచ్చారని దళితులు కిష్టన్న, పెంటయ్య, బాలయ్య, బాలపీరు, సంగమయ్య, శేషమ్మ, శాలయ్య, బాలయ్య తెలిపారు. దీంతో మంత్రి నోరు మూయండని బాధితులను బెదిరించారు. సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. న్యాయం కోసం వస్తే పట్టించుకోలేదని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్యాయం జరుగుతోంది న్యాయం చేయండి అని వచ్చిన దళితులపై ఇంత కర్కశత్వమా…?
ఆ దళిత బిడ్డలు అడిగింది మీ భూములివ్వమని కాదు… వారికి గతంలో ఇచ్చిన భూములను తీసుకోకుండా న్యాయం చేయండి అని. అంత మాత్రాన నోర్మూయ్ అంటూ సెక్యూరిటీని పెట్టి పంపిస్తారా? ఇందిరమ్మ రాజ్యంలో దళితుల… pic.twitter.com/z3VVG0lb9A
— KTR (@KTRBRS) September 18, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Telangana | ప్రజాపాలనంతా అప్పుల కుప్ప.. కాంగ్రెస్ ప్రభుత్వ అప్పు రూ.71,495 కోట్లు