KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పరిపాలనను గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో రేవంత్ సర్కార్ చెలగాటం ఆడుతుందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ సర్కార్ పాలనలో తెలంగాణ దీనస్థితికి అద్దం పట్టే ఫొటోలు ఈ రెండు అని కేటీఆర్ పేర్కొన్నారు.
సర్కారు దవాఖానాలో సరిపోను ఆక్సిజన్ సిలిండర్లు లేక ఇద్దరు చిన్నారులకు ఒకటే సిలిండర్ పెట్టిన దుస్థితి వరంగల్ ఎంజీఎంలో. కొనుగోలు కేంద్రాల్లో విపరీత జాప్యం చేస్తూ, ధాన్యం వర్షానికి తడుస్తున్నా సర్కారు కొనకపోవడంతో కామారెడ్డి జిల్లాలో అధికారుల కాళ్ల మీద పడ్డ రైతన్న చిత్రం ఇది అని కేటీఆర్ పేర్కొన్నారు.
పాలన పడకేసి ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులేమో కప్పం కట్టడానికి ఢిల్లీ బాటపట్టారు అని కేటీఆర్ విమర్శించారు.
అసమర్ధ కాంగ్రెస్ సర్కారు పాలనలో
తెలంగాణ దీనస్థితికి అద్దం పట్టే రెండు ఫొటోలివి.👉 సర్కారు దవాఖానాలో సరిపోను ఆక్సిజన్ సిలిండర్లు లేక ఇద్దరు చిన్నారులకు ఒకటే సిలిండర్ పెట్టిన దుస్థితి వరంగల్ ఎంజీఎంలో.
👉 కొనుగోలు కేంద్రాల్లో విపరీత జాప్యం చేస్తూ, ధాన్యం వర్షానికి తడుస్తున్నా… pic.twitter.com/5zfPs8FWhM
— KTR (@KTRBRS) October 26, 2025